Mane Praveen

Oct 09 2023, 21:49

నకిరేకల్: క్యూబా విప్లవకారుడు కామ్రేడ్ చేగువేరా స్ఫూర్తితో పోరాడుదాం: డేవిడ్ కుమార్
NLG: క్యూబా ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవ యోధుడు.. కామ్రేడ్ చేగువేరా స్పూర్తితో ఉద్యమించాలని CPI (M-L ) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం. డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు. నకిరేకల్ పట్టణంలోని కామ్రేడ్ యానాల మల్లారెడ్డి స్మారక భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో AIKMS జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి అధ్యక్షతన చేగువేరా వర్ధంతి సభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేగువేరా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డేవిడ్ కుమార్ మాట్లాడుతూ.. దోపిడీ, పీడన, అసమానతలు లేని వ్యవస్థను క్యూబాలో చేగువేరా నిర్మించాడని అన్నారు. ఎల్లలు లేని విశాల దృక్పథంతో స్వేచ్ఛయుత సమాజం కోసం అనారోగ్యం ను లెక్కచేయకుండా, చిన్న వయసులోనే అవిరామంగా పోరాటం చేసినాడని గుర్తు చేశారు. నేటి యువత చేగువేరా స్పూర్తితో పోరాడాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు.

కేంద్రంలో, రాష్ట్రంలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను యువత ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. తనకు ఆయాసం ఒక చిన్న సమస్యగా ఉన్నా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ బైక్ ప్రయాణం చేస్తూ ప్రజలకు కూడా హక్కులు ఉంటాయని.. 'బానిసలుగా బ్రతకడం కన్నా లేచి నిలబడి దైర్యం గా ప్రాణాలు వదిలేయడం మేలు' అని ప్రజల్లో స్ఫూర్తినిచ్చే మాటలను చెప్తూ ప్రజల అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకొని, శత్రువుల చేతిలో ప్రాణాలు పోతున్నా అతని కళ్ళల్లో ఎక్కడ కూడా భయం కనపడలేదని ఆయనను కొనియాడారు. పోరాట పటిమ కసి, చిరునవ్వు మాత్రమే కనిపించిందని, శత్రువులకు కూడా ఆశ్చర్యం కలిగించేలా చేసిన యోధుడు చేగువేరా అని, కాల్చి చంపుతున్నా.. ఒనకని బెనకని గుండెల నిండా దైర్యం ఉన్న మనిషి, ప్రపంచ విప్లవ కారుడు కామ్రేడ్ చేగువేరా అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో PYL రాష్ట్ర అధ్యక్షుడు ఇందూరు సాగర్, AIKMS జిల్లా అధ్యక్షుడు జ్వాల వెంకటేశ్వర్లు, POW జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, AIKMS జిల్లా నాయకులు సిలువేరు జానయ్య, అంబటి వెంకన్న, బూరుగు సత్తయ్య, జానపాటి దేవయ్య, PYL జిల్లా అధ్యక్షుడు మామిడోజు వెంకటేశ్వర్లు, రావుల లింగయ్య, బండారి వెంకన్న, వేముల శంకర్, దేవరకొండ జానయ్య, పసుపులేటి సోమయ్య, చెరుకు సైదులు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Oct 09 2023, 20:37

NLG: నిరుద్యోగులకు శుభవార్త
నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యందు 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న వాణిజ్య శాస్త్రం - 01, అతిధి అధ్యాపక పోస్టు భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ లో 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం
ప్రాధాన్యత: నెట్/సెట్/పీహెచ్డీ మరియు బోధన అనుభవం

పూర్తి చేసిన దరఖాస్తు తో పాటు విద్యా అర్హతలు, బోధనా అనుభవం సర్టిఫికెట్లతో ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలన్నారు. తదుపరి అభ్యర్థులు ఈనెల 12వ తేదీన తమ  ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ కు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు. Share it

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 09 2023, 16:22

లెంకలపల్లి వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల
నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నేడు మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో లెంకలపల్లి నుండి భీమ్లా తండా వరకు బి.టి రోడ్డు , మరియు లెంకలపల్లి నుండి నెర్మట దారి లో గల జమ్మి చెట్టు వద్ద వాగు పై బ్రిడ్జ్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ పాక నగేష్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాక నగేష్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తూ, గ్రామ అభివృద్ధిలో  పాలుపంచుకుంటున్నందుకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, మాజీ మాల్ మార్కెట్ చైర్మన్ దంతు జగదీష్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 09 2023, 13:57

తెలంగాణలో ఎన్నికలకు తేదీలు ఖరారు.. నవంబర్ 30న పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు - 2023 నోటిఫికేషన్ కు రంగం సిద్ధం అయింది. ఎలక్షన్ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు తేదీలు ఖరారు చేశారు.

గెజిట్ నోటిఫికేషన్ విడుదల- నవంబర్ 3

నామినేషన్ దాఖలకు చివరి తేదీ నవంబర్ 10

నామినేషన్ల పరిశీలన - నవంబర్ 13

నామినేషన్ ల ఉపసంహరణ కు అవకాశం- నవంబర్ 15

ఎన్నికల పోలింగ్ తేదీ -నవంబర్ 30

ఓట్ల లెక్కింపు - డిసెంబర్ 3 SB NEWS SB NEWS TELANGANA

Mane Praveen

Oct 09 2023, 06:30

NLG: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. నేటి పర్యటన వివరాలు
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం మర్రిగూడ మునుగోడు మండలాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారు గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేయనున్నారు. అదేవిధంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు
*ఉదయం 8 గంటలకు మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో..
*ఉదయం 8:30 కి మర్రిగూడ పట్టణంలో..
*ఉదయం 9 గంటలకు మర్రిగూడ విజయ గార్డెన్ లో మండలానికి సంబందించిన లబ్దిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందచేయనున్నారు. *ఉదయం 11 గంటలకు లెంకలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
*మధ్యాహ్నం 12 గంటలకు మునుగోడు సత్య ఫంక్షన్ హాల్లో మండలానికి సంబందించిన లబ్దిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందచేయనున్నారు.
ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 08 2023, 20:48

TS: ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీ, ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసిబి డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ శ్రీనివాస్ ను తెలంగాణ పోలీస్ అకాడమీ అడిషనల్ డైరెక్టర్ గా, డిఐజి హోంగార్డ్స్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ లో పనిచేస్తున్న అంబర్ కిషోర్ జా ను రాచకొండ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపో, ఎల్లుండో షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో సీనియర్ ఐపిఎస్ అధికారులను బదిలీ చేశారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 08 2023, 15:00

ఆశ వర్కర్ల సమ్మె 14వ రోజు: అలుపెరుగని ఆశాల పోరాటం.. వంటావార్పు తో నిట్టూర్పు..

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్స్ సమ్మెలో భాగంగా ఆదివారం,  రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా 14వ రోజు వంటావార్పు కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేలు  ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ, రాష్ట్రంలో అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ వర్కర్లు నిరసనలు తెలియజేస్తున్నారని అన్నారు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆశాల పట్ల కనికరం కలగడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సుమారు 28,000 మంది ఆశా వర్కర్ పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కావడం వలన ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఆలోచించి ఈ ఆరోగ్య కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, భీమనపల్లి అరుణ, కాలం సుజాత, పల్లె కౌసల్య, కోయ మంజుల, ఎస్.కె సైదాబీ, విజయమ్మ, అలివేలు మంగ, పందుల పద్మ, లప్పంగి దుర్గమ్మ, పొనుగోటి సునీత, మంజుల, ధనమ్మ, యాదమ్మ, సునీత, జాజాల అనిత, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Oct 08 2023, 14:25

బీఎస్పీ సాగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమల్ల వెంకటేశ్వర్లుకు అనారోగ్యం, హాస్పిటల్లో సందర్శించిన బిఎస్సి నాయకులు
NLG: సాగర్ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఇన్చార్జి ఆదిమల్ల వెంకటేశ్వర్లు అనారోగ్యంతో, నేడు మిర్యాలగూడ అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ రాష్ట్ర మహిళ నాయకురాలు ఇంద్రకంటీ కవిత, నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకులు ముదిగొండ వెంకటేశ్వర్లు, బత్తుల ప్రసాద్, రమావతు రమేష్ రాథోడ్, బైరాగి విజయ, రమావత్ సర్దార్ తదితరులు హాస్పిటల్ కి వచ్చి ఆదిమల్ల వెంకటేశ్వర్లు కండిషన్ తెలుసుకొని, డాక్టర్ల తో మాట్లాడారు. 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత కండిషన్ ఎలా ఉన్నది చెప్తామని డాక్టర్లు తెలిపినట్లు నాయకులు తెలిపారు. అక్కడే ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. మరింత సమాచారం తెలియాల్సింది.

Mane Praveen

Oct 08 2023, 14:03

మరి కొద్ది సేపట్లో ముదిరాజుల ఆత్మగౌరవ సభ, అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: దాసరి గణేష్ ముదిరాజ్
NLG: తెలంగాణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 3 గంటలకు సికింద్రాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ముదిరాజుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ MEPA, మర్రిగూడ మండల అధ్యక్షులు దాసరి గణేష్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో 14.7% ఉన్న ముదిరాజు లకు అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పార్టీ 20 ఎమ్మెల్యే సీట్లు, 3 పార్లమెంటు సీట్లు కేటాయించాలని, మరికొన్ని డిమాండ్లతో ముదిరాజుల మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ముదిరాజ్ బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభ ను విజయవంతం చేయాలని కోరారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 08 2023, 09:23

ఈనెల 14న ఎంగిలిపువ్వు బతుకమ్మ
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో  ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా అర్చకులు మొహనాచార్యులు మాట్లాడుతూ.. ఈనెల 14న  శనివారం నాడు ఎంగిలిపువ్వు బతుకమ్మ, 22న ఆదివారం నాడు సద్దుల బతుకమ్మ, 23న సోమవారం నాడు విజయదశమి దసరా పండుగ జరుపుకోగలరని, కారంపూడి మోహనాచార్యులు శ్రీ భక్తానంజనేయ సహిత సంతోషిమాత దేవాలయం అర్చకులు తెలిపారు. SB NEWS SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA